
వైభవంగా పల్లకీ ఉత్సవం
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పల్లకీలో కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో చెన్నకేశవునికి అడుగడుగునా భక్తులు హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నకేశవులు జ్ఞాపకార్థం కుమారుడు ప్రసాద్, సోలిగాళ్ల బాలకృష్ణ జ్ఞాపకార్థం సోలిగాళ్ల వెంకటేషు ఉభయదాతలుగా వ్యవహరించారు.