
ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్‌ఏ) కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. స్థానిక ట్రెజరీ హోమ్‌లో నిర్వహించిన ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారులుగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు పి.కిరణ్‌కుమార్ (నెల్లూరు), డి.రవికుమార్(కర్నూలు), ఎన్నికల పరిశీలకులుగా ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు ఎ.రవికుమార్ వ్యవహరించారు. కార్యవర్గంలోని అన్ని స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రటించారు. ఎన్నికై న సభ్యులకు ప్రోసీడింగ్స్ అందజేశారు.
నూతన కార్యవర్గ సభ్యులు వీరే..
ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.శంకరనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ఫారూక్ మహమ్మద్, కార్యదర్శిగా జి.మహేశ్వరెడ్డి, కోశాధికారిగా బి.అనంతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పి.సుమనలత, జి.జగదీష్, ఎం.శ్రీనివాసరావు, కె.వాసుమూర్తియాదవ్, సంయుక్త కార్యదర్శులుగా పి.సిద్ధిక్‌ఖానుమ్, డి.శ్రీనివాసులు, ఎం.కె.రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సి.తిరుమలరెడ్డి, సి.కిషోర్‌కుమార్‌చౌదరి, జి.ఉమేష్ ఎన్నికయ్యారు.
11,12న ‘వజ్రగిరి’ బ్రహ్మోత్సవాలు
పెద్దపప్పూరు: మండలంలోని తిమ్మన చెరువు గ్రామ సమీపంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11,12న నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 11న స్వాముల వారి ఉత్సవమూర్తులను తిమ్మనచెరువు గ్రామం నుంచి కొండపైకి మేళతాళాలతో ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు.అదే రోజు రాత్రి హైదరాబాద్ పట్టణానికి చెందిన సంగీత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.12 తెల్లవారుజామున తిరుపతికి చెందిన వేదమురళి క్రిష్ణమాచారి (సామవేద పండితుడు) వారి శిష్యబృందంచే హోమం, శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. తిమ్మనచెరువు, జూటూర గ్రామస్తులు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక