
నిజానిజాల్ని ప్రజలకు వివరిద్దాం
అనంతపురం మెడికల్: ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే సామాజిక మాధ్యమాల ద్వారా నిజం గళం వివరించి ప్రజలను చైతన్యవంతునలు చేద్దామని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మెల్‌బోర్న్‌లో జరిగిన వైఎస్సార్ సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజలకు పథకాలు అందించడం ద్వారా సంక్షేమ విప్లవాన్ని సృష్టించారన్నారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేశారని, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చడమే కాకుండా అన్ని వర్గాల వారికి ఖరీదైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలనలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాయాలను తీసుకువచ్చి ఒకేసారి 1,25,000 మందికి ఉద్యోగాలు, 2.6 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. ఇంటి వద్దకే పాలననందించారన్నారు. అబద్దాలకు గళం ఇస్తే మనం వాస్తవాలకు శబ్దం ఇవ్వాలని, డేటా, గణాంకాలు, గ్రాపులు ఇవేన ఆయుధాలని, జగనన్నను సీఎం చేసుకోవడానికి ప్రవాసాంధ్రులు పోరాట పటిమను చాటాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్ సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, మెల్‌బోర్న్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ విభాగం
కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి
మెలబోర్న్‌లో ప్రవాసాంధ్రులతో
సమావేశం