తూనీగ.. తూనీగ.. | - | Sakshi
Sakshi News home page

తూనీగ.. తూనీగ..

Sep 24 2024 12:56 AM | Updated on Sep 24 2024 12:56 AM

తూనీగ

తూనీగ.. తూనీగ..

ప్రకృతి ప్రసాదించిన అందమైన జీవరాసుల్లో ఒక్కటైన తూనీగలు పుట్టపర్తి పరిసరాల్లో కనువిందు చేస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా తూనీగల సంచారం మొదలైంది. ఎక్కువగా వరి మడుల ప్రాంతంలో సంచరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దోమలు, ఆకులను కత్తిరించే ఈగలు వంటి వాటిని ఆహారంగా తీసుకునే తూనీగలు... పంటల సాగులో అన్నదాతలకు ఎంతో సహాయకారిగా ఉంటాయని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఒక తూనీగ రోజుకు 30 నుంచి వందల కొద్ది దోమలను, ఈగలను తినేస్తుందంటున్నారు. – పుట్టపర్తి రూరల్‌:

కత్తెర పురుగుపై దాడి చేస్తున్న

దృశ్యం

మకరందాన్ని ఆస్వాదిస్తున్న తూనీగ

భారీగా ఎంపీడీఓల బదిలీలు

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకేసారి 40 మంది ఎంపీడీఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అనుమతితో ఈ బదిలీలు పూర్తి చేశారు. ఎంపీడీఓల బదిలీల జాబితాను జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ సోమవారం రాత్రి విడుదల చేశారు. బీకేఎస్‌లో పనిచేస్తున్న కె.తేజోష్స్నను పామిడికి, అక్కడ పనిచేస్తున్న డి.ప్రభాకర్‌ను గుత్తికి బదిలీ చేశారు. రాప్తాడులో పనిచేస్తున్న జె.స్మాలన్‌ను బీకేఎస్‌కు కేటాయించారు. కదిరి రూరల్‌ నుంచి జి.శ్రీకాంత్‌ చౌదరిని గుంతకల్లు రూరల్‌కు, బెళుగుప్ప నుంచి జి.ఎస్‌.రామచంద్రను కళ్యాణదుర్గం రూరల్‌కు, పెద్దపప్పూరు నుంచి బి.రామకృష్ణను శెట్టూరుకు, నార్పలలో పని చేస్తున్న పి.దివాకర్‌ను అనంతపురం రూరల్‌కు, కుందుర్పి నుంచి జి.లక్ష్మీనరసింహను ఆత్మకూరుకు బదిలీ చేశారు. తాడిపత్రి రూరల్‌ నుంచి ఎ.వి.రంగారావును తాడిమర్రికి, అక్కడి నుంచి బి.విజయలక్ష్మిని రాప్తాడుకు, నల్లమాడ నుంచి ఎం.కొండన్నను రాయదుర్గానికి, కనగానపల్లి నుంచి టి.అలివేలమ్మను పుట్లూరుకు, అక్కడి నుంచి టి.యోగానందరెడ్డిని గార్లదిన్నెకు, ధర్మవరం రూరల్‌ నుంచి పి.సౌజన్యను యల్లనూరుకు, అక్కడ పనిచేస్తున్న వీర్రాజును యాడికికి, అక్కడ పనిచేస్తున్న టి.లక్ష్మీనారాయణను బెళుగుప్పకు, కొత్తచెరువు నుంచి బారాన్‌సాహెబ్‌ను పెద్దవడుగూరుకు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న పి.కుళ్లాయిస్వామిని కూడేరుకు, అగళి నుంచి బి.వి.రవిప్రసాద్‌ను ఉరవకొండకు, బొమ్మనహాళ్‌ నుంచి ఎస్‌.షకీలా బేగంను విడపనకల్లుకు, అక్కడ పనిచేస్తున్న ఎ.వి.శ్రీనివాసులును బుక్కపట్నానికి, లేపాక్షి నుంచి ఎం.నరసింహనాయుడును బత్తలపల్లికి, అక్కడ పనిచేస్తున్న ఎస్‌.సాయి మనోహర్‌ను ధర్మవరానికి, గార్లదిన్నె నుంచి డి.విజయభాస్కర్‌ను ముదిగుబ్బకు, అక్కడ పనిచేస్తున్న కె.వి.కవిరాజును రొళ్లకు, గోరంట్ల నుంచి ఎన్‌.రఘునాథగుప్తను నల్లచెరువుకు, అక్కడ పనిచేస్తున్న వి.శకుంతలను పెద్దపప్పూరుకు, పెనుకొండ నుంచి ఎన్‌.శివశంకరప్పను చెన్నేకొత్తపల్లికి, అక్కడ పనిచేస్తున్న ఎస్‌.గంగావతిని నార్పలకు బదిలీ చేశారు. గుమ్మఘట్ట నుంచి ఎస్‌.నరసింహమూర్తికి లేపాక్షి, గుడిబండ నుంచి డి.రామారావుకు అమరాపురం, హిందూపురం రూరల్‌ నుంచి పి.నరేంద్రకుమార్‌కు గోరంట్ల, పరిగిలో పనిచేస్తున్న వి.సరస్వతికి సోమందేపల్లి, రొద్దం నుంచి రాబర్ట్‌ విల్సన్‌కు ఓడీసీ, రొళ్ల నుంచి ఆజాద్‌కు రామగిరికి, బ్రహ్మసముద్రంలో పనిచేస్తున్న దాసానాయక్‌కు డి.హీరేహాళ్‌ కేటాయించారు. ఇక అంతర్‌ జిల్లా నుంచి అగళికి ఎస్‌.యాదవేంద్ర, కదిరి రూరల్‌కు పి.పోలప్పల్‌, గాండ్లపెంటకు బి.వెంకట్రామిరెడ్డి బదిలీపై రానున్నారు.

తూనీగ.. తూనీగ.. 1
1/6

తూనీగ.. తూనీగ..

తూనీగ.. తూనీగ.. 2
2/6

తూనీగ.. తూనీగ..

తూనీగ.. తూనీగ.. 3
3/6

తూనీగ.. తూనీగ..

తూనీగ.. తూనీగ.. 4
4/6

తూనీగ.. తూనీగ..

తూనీగ.. తూనీగ.. 5
5/6

తూనీగ.. తూనీగ..

తూనీగ.. తూనీగ.. 6
6/6

తూనీగ.. తూనీగ..

Advertisement
 
Advertisement
Advertisement