
వైఎస్సార్‌సీపీలో చేరిన గోరంట్లపల్లి వాసులతో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
పుట్టపర్తి: కొత్తచెరువు మండలం గోరంట్లపల్లిలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలో టీడీపీకి చెందిన మొత్తం 150 కుటుంబాలు శుక్రవారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించిన గ్రామస్తులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. కాగా, గ్రామంలో అధికంగా బలిజలు ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వీరంతా ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. వీరి చేరికతో ఆ గ్రామంలో మొత్తం టీడీపీ తుడిచిపెట్టుకు పోయినట్లైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదరికం దూరమవుతోందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ తామంతా మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారిలో కృష్ణమూర్తి, గోరంట్ల గురుమూర్తి, తిరుపాలు, తొండమాల గురుమూర్తి, ప్రసాద్, రామప్ప, వెంకటేష్, చలపతి, మురళి, అంజి, రామప్ప, పుల్లప్ప, పెద్దన్న, రమణ, నాగరాజు, ప్రసాద్, ఆనంద్, రాము, గంగాద్రి, రఘు, సాయిరూపతేజ, పవన్‌కుమార్, గురు, చంద్ర, దాదావలి, సాయికుమార్, నరేష్, నిజాం, ఎంకే వెంకటేష్, ఓబులప్ప, గంగులప్ప, నాయక్, చండ్రాయుడు, ఉదయ్ సాయి, వెంకటరమణ, కన్నా, లోకనాథ్, సయ్యద్, ఇమామ్‌సాహెబ్, సోము, చైతన్య, డి.ప్రసాద్, నారాయణమ్మ, సుజాత, సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీదేవి, సునందమ్మ, ప్రమీల, అంజనమ్మ, భాగ్యమ్మ, మహేశ్వరి, ఉమాదేవి, వరాలమ్మ, ధనమ్మ, కృష్ణమ్మ, సర స్వతి, తిప్పమ్మ, ఆదిలక్ష్మమ్మ, పద్మావతి, లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు. వీరంతా జెడ్పీటీసీ గంగాదేవి, మటన్ శంకర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో దాల్‌మిల్ సూరి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.