
సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వస్తున్న విద్యార్థులు
అనంతపురం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ అండ్ ఒకేషనల్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలోని యువ టూరిజం క్లబ్ ఈ నెల 26, 27 తేదీల్లో ‘ఇంటర్ కాలేజ్ ఫెస్ట్–2023’ నిర్వహించనుంది. యంగ్ మేనేజర్, ట్రెజర్ హంట్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్విజ్ వంటి పోటీలలో అనంతపురం సమీపంలోని కళాశాలల విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా ఈ–పోస్టర్ మేకింగ్ పోటీని ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో విజేతలకు 27న ఆకర్షణీయమైన ప్రైజ్ మనీ అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ రుచులను పరిచయం చేసేందుకు వివిధ ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ టూరిజం అథారిటీ సహకారంతో మేనేజ్‌మెంట్ విభాగం సోమవారం వరల్డ్ టూరిజం డే థీమ్ ‘టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్’పై వ్యాసరచన, ప్రసంగాన్ని కూడా నిర్వహించింది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులు కోరారు.