దోచిపెట్టేందుకు ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

దోచిపెట్టేందుకు ‘పచ్చ’పాతం

Jun 3 2023 12:20 AM | Updated on Jun 3 2023 12:20 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోడ్లు, భవనాల శాఖలో భారీగా అవినీతి జరిగింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క భారీ స్కామ్‌కు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ టెండర్‌కు ఓకే చేసి కాంట్రాక్టర్‌కు మేలు చేశారు. కాసుల కోసం లాలూచీ పడి ఖజానాకు చిల్లు పెట్టారు.

టీడీపీ నేతతో కుమ్మక్కు..

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ తమ్ముడు మడకశిరలో కాంట్రాక్టరు. ఈయన కోసం ఆర్‌అండ్‌బీ పెద్దలు సాగిలపడ్డారు. ఇటీవలే మడకశిర నియోజక వర్గంలో పరిగి–యు రంగాపురం, అమరాపురం–మధూడి, మధూడి–గాయత్రి కాలనీలో రోడ్డుపనులకు టెండర్లు పిలిచారు. ఈ మూడు వర్కులకు సంబంధించిన పనుల విలువ రూ.6.45 కోట్లుపైనే. సాధారణంగా ఏదైనా పనికి సింగిల్‌ టెండరు వస్తే వీటిని మళ్లీ టెండరుకు పిలవాలి. కానీ ఇలా చేయకుండా నేరుగా ఇచ్చారు. డీఈలు ఇచ్చిన ఎస్టిమేషన్‌లు (అంచనాలు) కనీసం సమీక్షించలేదు. పైగా అంచనాలు భారీగా పెంచేసి వర్కులు వచ్చారు. ఈ తతంగంలో ఆర్‌అండ్‌బీలో ఉన్నతాధికారి ఒకరు కీలకంగా వ్యవహరించి కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రివర్స్‌ టెండర్‌కు మంగళం..

ఏదైనా ఒక పనికి సింగిల్‌ టెండర్‌ దాఖలైతే నిబంధనల ప్రకారం రెండో కాల్‌కు వెళ్లాలి. రెండో కాల్‌కూడా రానప్పుడు మూడో కాల్‌లో ఫైనల్‌ చేయాలి. ఇవేవీ లేకుండా సింగిల్‌ టెండర్‌కే అధికారులు పనులు అప్పగించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 80 శాతం, 20 శాతం స్టేట్‌బ్యాంక్‌ నిధులతో నిర్మించాల్సిన ఈ రోడ్లలో భారీగా కమీషన్లు ముట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ వర్కులకు సంబంధించి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఇందులోనూ మతలబు చేశారు. ఈ పనులన్నీ ఒకే వర్క్‌ కింద చూపితే పెద్ద కాంట్రాక్టర్లు వస్తారన్న ఉద్దేశంతో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి మెలిక పెట్టారు. దీంతో టీడీపీ నేత తమ్ముడికి లబ్ధికలిగేలా ఈ పనులను ముక్కలుగా చేసి ఇచ్చారు. సదరు ఉన్నతాధికారి గతంలో నేషనల్‌ హైవేస్‌లో పనిచేసినప్పుడు కూడా భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

ఆర్‌అండ్‌బీలో అవినీతి జలగ

టీడీపీ నేత తమ్ముడికి జీహుజూర్‌

కాసులకు కక్కుర్తి పడి

సింగిల్‌ బిడ్డర్‌కే గ్రీన్‌ సిగ్నల్‌

రివర్స్‌ టెండరింగ్‌ లేకుండానే

అగ్రిమెంటు పూర్తి

ప్రభుత్వానికి భారీగా నష్టం

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement