
మహాజన సభలో మాట్లాడుతున్న డీసీఎంఎస్ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా రైతులకు విశిష్ట సేవలందిస్తున్నామని చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం డీసీఎంఎస్ కార్యాలయంలో బిజినెస్ మేనేజర్ టి.విజయభాస్కర్ అధ్యక్షతన 79వ వార్షిక మహాజన సభ నిర్వహించారు. చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం డీసీఎంఎస్ సేల్స్ పాయింట్స్ ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. పురుగు మందుల అమ్మకాలు, పప్పుశనగ కొనుగోళ్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎరువుల అమ్మకాల ద్వారానే ఈ ఏడాది రూ.8.83 కోట్లు, మిగతా వాటి ద్వారా మరో రూ.3 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో మున్ముందు రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్లు శ్రీరామరెడ్డి, జగదీష్‌చౌదరి, జబీవుల్లా, నాగమ్మ, హెచ్.కిష్టప్ప, ఎంజీ సుమంగళమ్మ, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.