
పాదయాత్రగా వెళుతున్న లోకేష్
గోరంట్ల/సోమందేపల్లి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆయన పాదయాత్ర మంగళవారం గోరంట్ల మండల పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి నుంచి ప్రారంభమైంది. కొత్తపల్లి, మల్లాపల్లి, రాగిమాకులపల్లి మీదుగా పాలసముద్రం చేరుకుంది. అక్కడ భోజన విరామం అనంతరం మిషన్ తండా మీదుగా హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి గుండా సోమందేపల్లి మండలంలోకి ప్రవేశించింది. నల్లగొండరాయునిపల్లిలో రాత్రిబస చేశారు. పాదయాత్రలో ఎక్కడా పెద్దగా జనం కన్పించలేదు. లోకేష్ సహాయక సిబ్బంది మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కాగా.. వెలుగుమాకులపల్లి క్రాస్ వద్ద టీడీపీ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా జెండాలు పట్టుకుని హల్‌చల్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై దాదాపు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.

టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌తో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు