● రీ సర్వేలో గానీ, ఇతర అనేక భూ వ్యవహారాలకు సంబంధించిన రికార్డుల్లో తప్పులు నమోదు చేస్తోంది రెవెన్యూ వర్గాలేనని రైతులు పేర్కొంటున్నారు.
● ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి వాసి సుబ్బరాయుడికి మహిమలూరులో పొలముంది. అయితే ఆయనకు తెలియకుండానే పట్టా భూమిని నోషనల్ ఖాతాలో ఉంచారు. దీనికి కారణం వీఆర్వో అని తెలుస్తోంది. తన పట్టా పొలాన్ని నోషనల్ ఖాతా నుంచి తొలగించాలని కోరుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా, ఆ ఫైల్‌ను కలెక్టరేట్‌కు ఇప్పటికీ పంపలేదు. లంచాలివ్వలేదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
● ఆత్మకూరు మండలంలోని నల్లపరెడ్డిపల్లెకు చెందిన కరవళ్ల రవీంద్రరెడ్డి సైతం రీ సర్వేలో సర్వేయర్ చేసిన తప్పులను సరి చేయాలని తహసీల్దార్‌కు విన్నవించారు. ఇదే అంశమై కలెక్టరేట్లో అర్జీలనూ ఇటీవల అందజేశారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అదే పైసలిచ్చి ఉంటే సత్వరమే పనులు జరిగేవని రెవెన్యూ ఉద్యోగులే పేర్కొన్నారని సమాచారం.
● బోగోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా రైతుకు సంబంధించిన 16 సెంట్ల పట్టా పొలాన్ని రీ సర్వేలో అవతలి వారితో కుమ్మకై ్క బాటగా చూపారని తెలిసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకొని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
● ఉద్యోగోన్నతి పొంది పది రోజులు కాకముందే
● రూ.20 వేలు డిమాండ్ చేసి పట్టుబడిన తహసీల్దార్
● కలగా మారిన ప్రక్షాళన
నెల్లూరు(అర్బన్): రెవెన్యూ డేను ఆ శాఖ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ, డీఆర్వో, రెవెన్యూ సంఘాల నేతలు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు మంచి సేవలందిస్తామంటూ ఉపన్యాసాలిచ్చారు. అయితే ఉద్యోగోన్నతి పొంది పట్టుమని పది రోజులు కాకముందే తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన అధికారి మ్యుటేషన్ కోసం ఏకంగా రూ.20 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ విషయం రెవెన్యూ వర్గాలతో పాటు జిల్లాలో సంచలనంగా మారింది. ఇలాగేనా సేవలందించేదంటూ పలువురు విమర్శిస్తున్నారు.
ప్రతి పనికో రేటు
జిల్లాలో రెవెన్యూ వ్యవస్థలో ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారనే విమర్శలు జోరందుకుంటున్నాయి. కలెక్టరేట్లోని సీసీల మొదలుకొని కింది స్థాయి వీఆర్వోల వరకు ఈ అవినీతి పరంపర సాగుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. పాస్‌పుస్తకం కావాలన్నా.. అందులో తప్పులను సరిదిద్దాలన్నా.. నోషనల్ నుంచి రెగ్యులర్ ఖాతాకు మార్చాలన్నా.. నిషేధిత భూముల ఫైల్ నడపాలన్నా.. ఇలా ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.
తప్పులు చేసేదీ వారే.. లంచాలడిగేదీ వారే..!