పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

పటిష్ట భద్రత

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

నెల్లూరు(క్రైమ్‌): నీట్‌ను ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడా రు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రాలను ఏఎస్పీ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement