కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఫీజులపై గతంలో రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఇది ఉందాననే సందేహం తలెత్తుతోంది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో వసతులు అధ్వానంగా మారాయి. భోజనం సైతం నాణ్యాతగా ఉండటం లేదు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు కార్పొరేట్ ఫీజులు చూసి భయపడుతున్నారు.
– నరహరి, అధ్యక్షుడు, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్


