కమనీయం.. సంగమేశ్వరుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. సంగమేశ్వరుని రథోత్సవం

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

సంగం: మండల కేంద్రంలోని కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంలో కొలువుదీర్చారు. అనంతరం గ్రామ వీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగం, ఆత్మకూరు సీఐలు శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌, సంగం సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు పర్యవేక్షించారు. రథోత్సవానికి కోటు దయాకర్‌రెడ్డి, కోటు కరుణాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement