నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిట్టేడి రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జానకిరామయ్యకు కార్యాచరణ నోటీసు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పది మూల్యాంకన కేంద్రానికి ఉపాధ్యాయులందరూ నిల్ల రిబ్బన్లతో హాజరు కావాలన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కోచైర్మన్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు చలపతిశర్మ, పిచ్చిబాబు, నరసింహం, దశరథరాములు, ఉదయభాస్కర్, కృష్ణారెడ్డి, రఘు, రాజశేఖర్, రవి, నరసయ్య పాల్గొన్నారు.
ట్రాక్టర్ అదుపుతప్పి..
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం సెంటర్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన విద్యుత్ తీగలు రాకపోకలకు అంతరాయం కలిగించాయి. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
ఐదుగురు జూదరుల అరెస్ట్
కావలి: కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుడంగుంట అంబేడ్కర్‌నగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఆదివారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై తిరుమలరెడ్డి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా పేకాట, కోడిపందెలు వంటి జూదాలు నిర్వహిస్తున్నా, గంజాయి రవాణా, విక్రయాలు, సేవనం, అక్రమ మద్యం విక్రయాలు చేపడుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.


