ఘనంగా వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వార్షికోత్సవం

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

గూడూరురూరల్‌: పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో శనివారం రాత్రి 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగర్‌ మంగ్లీ పాటలకు యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. యూనివర్సిటీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ వంకి పెంచలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, షార్‌ డైరెక్టర్‌ పద్మ కుమార్‌, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈడీ డాక్టర్‌ హుజైఫా ఖోరాకివాలా, సోలిటెక్‌ సోలార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హార్దిక్‌ రమణి, నౌకాయాన మంత్రిత్వ శాఖ షిప్పింగ్‌ ఏడీజీ జితేంద్ర జాదవ్‌, మిరాయ్‌, రాజాసాబ్‌ సినిమాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కుమార్‌ నిర్మల సృజన్‌, వర్సిటీ చాన్సలర్‌ వంకి అరవింద, ప్రో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ మోహన్‌, రిజిస్ట్రార్‌ రాజయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్‌ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement