మత్స్యకారుల మాటే శాసనం | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల మాటే శాసనం

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మత్స్యకారులను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ దఫా అయితే ‘జీవిత కాలం’ ద్రోహం తలపెట్టారు. దశాబ్దాలుగా సంక్షేమానికి, భవిష్యత్‌కు నోచుకోని సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల ఉజ్వల భవిష్యత్‌కు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌తో బాటలు వేస్తే.. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ భవిష్యత్‌ను భగ్నం చేస్తూ.. ఆశలను చిదిమేసే కుట్ర పూరిత చర్యలకు తెగించారు. రెండు దశాబ్దాలుగా తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు మెకనైజ్డ్‌ బోట్లతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి స్థానిక మత్స్యకారులపై దాడులు చేసి, వారి సాధారణ బోట్లను, వలలను ధ్వంసం చేసి మత్స్య సంపదను దోచుకెళ్తూనే ఉన్నా.. ఏ ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టలేకపోయాయి. ఈ దశలో ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను వారితో చేసుకున్న చీకటి ఒప్పందాలతో గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి.. స్థానిక మత్స్యకారుల ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారు. టీడీపీ పాలకుల చర్యలతో మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు తీసుకునే భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయం సర్కారు పెద్దల్లోనే కాకుండా.. స్థానిక అధికార పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ స్థానిక నేతలు తమిళ జాలర్లతో చేసుకున్న చీకటి ఒప్పందాలతో మత్స్యకారులకు చేసిన ద్రోహానికి తీర ప్రాంతం నివురు గప్పిన నిప్పులా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు సోమవారం ప్రకాశం జిల్లా పాకలలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని 164 మత్స్యకార గ్రామాల పెద్దలు, నాయకులు సమావేశం కానుండడంతో సర్కార్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. ‘మత్స్యకారుల మాటే శాసనం’ కావడంతో వారి అనుమతి లేకుండా ఆ గ్రామాల్లో కి అడుగుపెట్టే సాహసం ఎవరూ చేయలేకపోతు న్నారు. నమ్మితే ప్రాణాలిచ్చేంత మనస్సున్న మత్స్యకారులు.. అదే అన్యాయం చేసే ఎవరైనా సరై వారి పీచమణచడానికి కూడా వెనుకాడరు. తమ కుటుంబ సభ్యులైనా సరే జీవిత కాలం శిక్ష విధిస్తారు. ఇక తమకు ద్రోహం తలపెట్టిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు, నేతల విషయంలోనూ అటువంటి నిర్ణయం ఉండబోతోందనే సమాచారంతో ఉలిక్కి పడుతున్నారు. వారిని శాంత పరిచేందుకు నేలవిడిచి సాము చేస్తున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్‌ పరం

మత్స్యకారుల భవిష్యత్‌ను కాంక్షించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించారు. ఈ క్రెడిట్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ పరం చేసేందుకు రహస్యంగా సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయం శంకుస్థాపన చేసేంత వరకు మత్స్యకారులకు కూడా తెలియకుండా చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్వీర్యం చేసేందుకు దీనికి కేటాయించిన 70 ఎకరాల్లో సుమారు 29 ఎకరాలను సాగర్‌ డిఫెన్స్‌కు కట్టబెట్టారు. ఇది తొలి దశ మాత్రమేనని, భవిష్యత్‌లో మరింతగా విస్తరిస్తామని చెప్పడం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఫిషింగ్‌ హార్బర్‌ను మత్స్యకారులకు దక్కకుండా చేసే కుట్రగా కనిపిస్తోందని తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు మత్స్యకార కాపులు, మత్స్యకారులు పేర్కొన్నారు. తమ భూములను ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టే క్రమంలో తమ అభిప్రాయాలను కూడా తీసుకోకపోవడం .. ఫిషింగ్‌ హార్బర్‌నే లేకుండా చేసేందుకు వ్యూహంగా మత్స్యకారులు మండిపడిపోతున్నారు. ఈ పరిణామానికే మత్స్యకారులు రగిలిపోతుంటే.. తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్న పుదుచ్చేరి బోట్లను గుట్టు చప్పుడు కాకుండా వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండు వారాలకుపైగా పూర్తిగా చేపల వేటను బంద్‌ చేసి.. భవిష్యత్‌ కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ప్రకాశం జిల్లా పాకల కేంద్రంగా 164 మత్స్యకార గ్రామాలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నారు.

రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్ల మత్స్య దోపిడీ, దాడులు

ఈ దాష్టీకాన్ని అడ్డుకోలేకపోయిన గత ప్రభుత్వాలు

ముప్పై ఏళ్లలో 16 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ

ఏనాడూ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోని వైనం

ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించాలని ఆలోచనే చేయని ఆ ప్రభుత్వం

2019 ఎన్నికలకు ముందు

పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను గుర్తించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ

అధికారంలోకి రాగానే వారి ఉజ్వల భవిష్యత్‌కు శ్రీకారం

నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీరం వెంబడి ఏకకాలంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

రూ. 289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తి

జిల్లా పరిధిలోని మత్స్యకారులకు 1250 హైస్పీడ్‌ మెకనైజ్డ్‌ బోట్లు 50 శాతం రాయితీతో అందించేందుకు ప్రణాళిక

ప్రభుత్వం మారడం మత్స్యకారుల శాపంగా మారిన వైనం

మత్స్యకారుల కోసం నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్వీర్యం చేసేందుకు రహస్యంగా ప్రైవేట్‌ పరం

ప్రాణాలకు తెగించి పట్టుకున్న నాలుగు మెకనైజ్డ్‌ బోట్లు వదిలేసి ద్రోహం

నేడు ప్రకాశం జిల్లా పాకలలో 164 మత్స్యకార గ్రామాల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం

సర్కారులో ప్రకంపనలు.. అధికార పార్టీ నేతల్లో వణుకులు

ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. మా కడుపులు కొట్టేందుకు వీళ్లెవరు. మాకు ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతుంటే.. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉండండి. మా సమస్యను మమే పరిష్కరించుకుంటాం. కాదని మా జోలికి వస్తే.. మత్స్యకారులందరూ ఏకమైతే తట్టుకోలేరు. గత ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించింది. దీన్ని ప్రైవేటోళ్లకు ఇవ్వడానికి మీకేం హక్కు ఉంది. తీర ప్రాంతం మత్స్యకారుల హక్కు. మావాళ్లు ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన తమిళ బోట్లను వదిలిపెట్టినోళ్లు ఎవరో బయటపెట్టండి. ఇవన్నీ ప్రభుత్వం చేసిన ద్రోహాలు కదా?.

– కొమారి రాజు, మత్స్యకార నేత,

తుమ్మలపెంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement