● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సంగం: సంగం సమీపంలోని బీరాపేరు వంతెనపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన సిమెంట్ ట్యాంకర్ ముందుగా ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ను సైడ్‌లో ఢీకొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో బస్సు డ్రైవర్ ఆకస్మికంగా వాహనాన్ని ఆపడంతో వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి బస్సు కిందకు వెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని అధికారులు తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


