మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైన్స్‌, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల మత్స్యకారుల నుంచి జిల్లాలోని మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కోస్టల్‌ సెక్యూర్టీ ఐజీ గోపీనాథ్‌ జెట్టితో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మూడు బోట్లతో సముద్రంలో నిరంతర గస్తీని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్పీ సౌజన్య, మత్స్యశాఖ జేడీ శాంతి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాకర్లపై

లోకేశ్‌కు ఫిర్యాదు

ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కిన టీడీపీ మహిళా కార్యకర్త పచ్చవ వెంగమాంబ కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లాలో మంత్రి లోకేశ్‌ను కలిశారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేసిన కృషి.. కాకర్ల సురేష్‌ తనను రాజకీయంగా పెడుతున్న ఇబ్బందులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఉదయగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాకుండా పోలీసులు కిడ్నాప్‌ చేసిన వైనం... దాని వెనుక శాసనసభ్యుడి పాత్రపై లోకేశ్‌ వద్ద ప్రస్తావించారని సమాచారం. విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారనే అంశం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నేటి నుంచి

‘పది’ మూల్యాంకనం

నెల్లూరు (టౌన్‌): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సోమవారం నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు తెలిపారు. దర్గామిట్టలోని జెడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏడు ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్లుగా ఏడుగుర్ని నియమించామని వివరించారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 85 గ్రూపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చీఫ్‌ ఎగ్జామినర్లుగా 85 మంది.. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లుగా 510 మంది.. స్పెషల్‌ అసిస్టెంట్లుగా 255 మందిని నియమించామని చెప్పారు. విధులు నిర్వ ర్తించనున్న ఉపాధ్యాయులు.. క్యాంప్‌ ఆఫీసర్‌కు సోమవారం ఉదయం 8.30కు రిపోర్టు చేయాలని సూచించారు. హాజరు కాని వారి పై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

డయల్‌ యువర్‌

ఎస్‌ఈ నేడు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే లక్ష్యంగా డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నగరంలోని విద్యుత్‌ భవన్‌లో సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 0861– 2320427 నంబర్‌ను వినియోగదారు లు ఉదయం 8.30 నుంచి 9.30లోపు సంప్రదించి సమస్యలను తెలియజేయాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరింది. స్వామివారిని 80,841 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,559 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement