● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): నగరంలో బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణిని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పిల్లలతో కేక్‌ను కట్ చేయించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని హాస్టళ్ల అభివృద్ధే తన లక్ష్యమని వివరించారు. జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలను రూపొందించామని ప్రకటించారు. ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతాల్లో రెండు మెగా పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. డీఆర్వో విజయ్‌కుమార్, వివిధ సంఘాల నేతలు కలివెల ఎలీషాకుమార్, కుడుముల సుబ్బారావు, మన్నేపల్లి దాసు, మురళి, రాఘవేంద్రరావు, పెంచలయ్య, ఈపూరు వెంకటేశ్వరరావు, తాడిపర్తి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
● వేదాయపాళెం సెంటర్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు.


