ప్రాణాలకు తెగించి కడలిపై వేట సాగిస్తే తప్ప పూట గడవని స్థితిలోని మత్స్యకారులకు మరో బతుకుదెరువు లేదు. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కారణం.. ఆయా రాష్ట్రాల్లోని మత్స్యకారులకు ఉన్న హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రా మత్స్యకారులకు లేకపోవడమే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు, తమిళ బోట్ల దాష్టీకాలను గుర్తించి దీనికి చెక్ పెట్టాలంటే.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించడం ఒక్కటే మార్గమని భావించి.. ఆ మేరకు వారికి హామీ ఇచ్చారు. అధికారంలోకి గానే ఏక కాలంలో హైస్పీడ్ మెకనైజ్డ్ 1250 బోట్లు నిలిపే విధంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి రూ.2 కోట్లు విలువ చేసే మెకనైజ్డ్ బోటుకు స్థానిక మత్స్యకారులను యజమానులుగా చేసే విధంగా 50 శాతం సబ్సిడీతో 1250 బోట్లను సైతం ప్రభుత్వం అందించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిలు సిద్ధం చేశారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఎన్నికల సమయానికి పూర్తయింది. కానీ కోడ్ రావడంతో మత్స్యకారులకు అంకితం చేయలేకపోయారు. ఒక్క జువ్వలదిన్నెలోనే కాకుండా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మరో మూడో చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా అవి సైతం చివరి దశలో ఉన్నాయి. వీటిని ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వినియోగంలోకి తేకుండానే నిర్వీర్యం చేసే కుట్రకు తెగించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వినియోగంలోకి వచ్చి ఉంటే.. తమిళ జాలర్లకు పోటీగా వారి కంటే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మెకనైజ్డ్ బోట్లతో విస్తృతంగా మత్స్య సంపదను సేకరిస్తూ.. ఆంధ్రా మత్స్యకారుల తరతరాలు ఆర్థికంగా సంపన్నులుగా మారేందుకు అవకాశం ఉండేది.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్


