గ్రామాల మత్స్యకారులు ఐక్యమవుతున్నాం
ఇది మా మత్స్యకారుల భవిష్యత్ సమస్య
మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోగా తమ న్యాయ పోరాటాలను అడ్డుకోవడం మంచిది కాదు. ప్రకాశం జిల్లా పాకలలో జరిగే మత్స్యకార సమావేశాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న తమను అడ్డుకుంటే మత్స్యకారులంతా ఐక్యమై ప్రభుత్వంపై తిరగబడతాం. మత్స్యకారులకు మంచి చేయాల్సిన ప్రభుత్వం వెన్నుపోటు పొడిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– వీవీ రమణయ్య, మత్స్యకార గ్రామ పెద్ద తూపిలిపాళెం
సోమవారం ప్రకాశం జిల్లాలో జరిగే మత్స్యకారుల ఐక్య సదస్సుకు 164 గ్రామాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న మా సమస్యలకు మేమే శాశ్వత పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాపై చిత్తశుద్ధి ఉంటే.. వదిలేసిన బోట్లను తెచ్చిపెట్టండి. ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తీసుకురండి. అంతేకాని సదస్సుకు తమను పోనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తిరుపతి జిల్లా తడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న మత్స్యకారులంతా ఐక్యమై తిరుగుబాటు చేస్తాం.
– కె వెంకటేశ్వరు,్ల మత్స్యకారుడు, తూపిలిపాళెం
పాకలలో జరిగే మత్స్యకారుల మీటింగ్‌కు పాల్గొంటున్నాం. ఎవరు అడ్డుపడినా మత్స్యకారులందరూ తిరుగుబాటు చేస్తారు. ఇది మా మత్స్యకారుల భవిష్యత్ సమస్య. ప్రభుత్వం, అధికారుల సహకారం మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన ద్రోహం చాలు. మాకు అన్యాయం చేసి.. ఇప్పుడు సవతి ప్రేమ చూపిస్తే.. తలొగ్గిపోతామనుకుంటే అది మీ భ్రమే. రెండు దశాబ్దాలుగా బతుకు పోరాటం చేస్తున్నాం. తమిళనాడు బోట్లతో వచ్చిన అక్కడి మత్స్యకారులు మా కడుపులు కొడుతుంటే.. వారికి సపోర్టు చేయడం ఎంత వరకు న్యాయం.
– కొండూరు తిరుపతయ్య, ఇస్కపల్లిపాళెం, మత్స్యకారుడు, అల్లూరు మండలం
ప్రభుత్వం చేసింది
ద్రోహం కాదా?


