తండ్రి హత్య కేసులో కుమారుడికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

తండ్రి హత్య కేసులో కుమారుడికి జీవిత ఖైదు

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

నెల్లూరు(లీగల్‌): ఇల్లు రాసివ్వలేదన్న కక్షతో తండ్రిని దారుణంగా హత్య చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో కుమారుడికి శిక్ష పడింది. జీవిత ఖైదుతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు 5వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌.సరస్వతి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామం తల్లమిట్ట గిరిజన కాలనీకి చెందిన పొట్లూరి పోలయ్యకు వివాహమైంది. భార్య చనిపోయింది. కాగా అతని చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యం వేధింపులు భరించలేక భార్య వదిలేసి వెళ్లిపోయింది. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కుటుంబంతో వేరుగా అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. పోలయ్య పేరిట ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వాలని సుబ్రహ్మణ్యం నిత్యం వేధించేవాడు. తండ్రి విసిగిపోయి ఇద్దరు కుమారులకు ఇల్లు సమానంగా రాసిస్తానని చెప్పాడు. 2024 డిసెంబర్‌ 28వ తేదీన వెంకటేశ్వర్లు తండ్రికి టిఫిన్‌ తెచ్చిచ్చాడు. సుబ్రహ్మణ్యం ఇల్లు రాసివ్వాలంటూ పోలయ్యతో గొడవ పెట్టుకుని కోపంతో ఇంట్లో ఉన్న కత్తితో పొడిచాడు. కింద పడిన ఆయన్ను గొడ్డలితో తలపై నరికాడు. పోలయ్య అక్కడికక్కడే మరణించాడు. చుట్టుపక్కల వారు రావడంతో సుబ్రహ్మణ్యం పరారయ్యాడు. అదేరోజు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం సుబ్రహ్మణ్యంపై కోర్టులో చార్జిషీ ట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతోపై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అజయ్‌ ప్రేమ్‌కుమార్‌ వాదించారు.

అంగన్‌వాడీలకు కనీస వేతనాలివ్వాలి

ఆత్మకూరు: కనీస వేతనమివ్వాలంటూ అంగన్‌వాడీ వర్క ర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం ఆత్మకూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యనియన్‌ నాయకురాలు పి.రాధమ్మ మాట్లాడుతూ హెల్పర్ల ప్రమోషన్‌కు స్పష్టమైన సూచనలివ్వాలన్నారు. మే నెలలో వేసవి సెలవులివ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమూరి హజరత్తయ్య, తిరుపాలయ్య, ఎన్‌.రఘురామయ్య, ఎ.నాగయ్య, పి.రాధమ్మ, రమణమ్మ, రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement