ఉదయగిరి రూరల్: మండలంలోని దాసరిపల్లి, అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు.. దాసరపల్లి గ్రామ బీసీ కాలనీలో ఉన్న నాగార్పమ్మ ఆలయం, చౌటపల్లిలోని మహాలక్ష్మమ్మ, గంగమ్మ తల్లి ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు ఆలయాల తలుపులు తెరిచి ఉండటం, హుండీలు లేకపోవడాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించారు. అనంతరం పరిసరాలను పరిశీలించగా చౌటపల్లి గ్రామ చెరువు సమీపంలో నగలు, నగదు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడవేసిన హుండీలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు.
కండలేరులో
46.490 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 46.490 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 650, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 150, పిన్నేరు కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


