ప్రతిపక్షంపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని 29వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ షేక్ సత్తార్ అన్నారు. మమ్మల్ని కార్పొరేటర్లుగా అధికారులెవరూ చూడటం లేదని, దీంతో స్థానిక డివిజన్ ప్రజల్లో గౌరవం కూడా లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వకుండా
వాటర్ ప్లాంట్ ధ్వంసం
తన డివిజన్ పరిధిలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేశారని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ మేయర్‌ను కోరారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లందరూ మేయర్‌కు వినతిపత్రం అందజేశారు.


