కల్వర్టును ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌

Mar 30 2026 7:26 AM | Updated on Mar 30 2026 7:26 AM

డ్రైవర్‌ మృతి

కావలి: ఆయిల్‌ ట్యాంకర్‌ కల్వర్టును ఢీకొట్టి గుంతలో పడటంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం కావలి రూరల్‌ పరిధిలోని తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జంగారెడ్డిగూడెం నుంచి ఆయిల్‌ లోడ్‌తో కృష్టపట్నం పోర్టుకు ట్యాంకర్‌ వెళ్తోంది. ఇది కావలి తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని కల్వర్టును ఢీకొట్టి అదుపుతప్పి గుంతలో పడిపోయింది. దీంతో డ్రైవర్‌ పి.అంకయ్య (55) మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement