● అంకయ్య, రాజేంద్రప్రసాద్
నెల్లూరు(లీగల్): న్యాయవాదుల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తామని సీనియర్ న్యాయవాదులు సత్తు అంకయ్య, సుంక రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో ఐలు, న్యాయవాదుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ హెల్త్‌కార్డులు, స్టైఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, యూనియన్ జాతీయ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసా ద్ మాట్లాడుతూ పౌర సమాజానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా గెలుపొందామన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతతో పనిచేస్తామన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు బీవీ రమణరెడ్డి, నల్లారి మాధవరావు, నర్రా శ్రీనివాసరావు, ఐక్యవేదిక నాయకులు కుడుమల రవికుమార్, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందరయ్య యాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గంజి దయాకర్, కృష్ణుడు, రేఖారాణి, సాయికుమార్, కిరణ్, కొండల రావు, సుధీర్, దీక్షత్ పాల్గొన్నారు.


