వైఎస్సార్‌సీపీ నాయకులకు పదవులు
నెల్లూరు సిటీ: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్‌సీపీలో రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. కోవూరు నియోజకవర్గానికి చెందిన మావులూరు శ్రీనివాసులురెడ్డి రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీగా, నెల్లూరు నగరానికి చెందిన మన్నేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం పబ్లిసిటీ విభాగం జనరల్ సెక్రటరీగా, రూరల్‌కు చెందిన పప్పు విజయ్‌రెడ్డి ఐటీ విభాగం సెక్రటరీగా, సిటీకి చెందిన ఖాజన వెంకటశేషయ్య ఆచారిని రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


