 
															ఖాళీ స్థలంలో పేకాట
● పోలీసుల దాడులు
● 15 మంది జూదరుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని రాయపుపాళెం సమీప ఖాళీ స్థలాల్లో కొందరు పేకాటాడుతున్నారని గురువారం బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. పేకాటాడుతున్న ఎన్టీఆర్ నగర్‌కు చెందిన డి.రవికృష్ణ, డి.చంద్రమోహన్, కె.రవి, షేక్ మస్తాన్, రామచంద్రాపురానికి చెందిన ఆర్.సుబ్బారావు, బాలాజీ నగర్‌కు చెందిన విజయ, ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన జి.కృష్ణకాంత్, ఎస్.ఏలియా, పి.రత్నం, ఎం.రమేష్, నవాబుపేటకు చెందిన వి.సురేంద్ర, కొండాయపాళేనికి చెందిన వి.సందీప్‌రెడ్డి, విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన వేణు, పార్లపల్లికి చెందిన జి.వెంకటేశ్వర్లు, ఇందుకూరుపేటకు చెందిన కె.రవిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.91,910ల నగదు, ఆరు మోటార్‌బైక్‌లు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పుల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20
పండ్లు : రూ.10

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
