బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ | - | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

Oct 31 2025 7:28 AM | Updated on Oct 31 2025 7:28 AM

బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తుపాను బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. నెల్లూరు 53వ డివిజన్‌ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి డివిజన్‌ ఇన్‌చార్జి వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో, కో ఆర్డినేటర్‌ పరంధామయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలతో గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ముంపు ప్రాంత నిర్వాసితులైన 200 మందికి భోజనాలను గురువారం అందజేశారు. అనంతరం స్థానిక మహిళలు పర్వతరెడ్డిని కలిసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా నగర నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గాంధీ గిరిజన కాలనీలో గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరిందన్నారు. వారికి తాగునీరు కూడా కరువైందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆహారం అందజేయడం జరిగిందన్నారు. వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో బియ్యంతోపాటు 5 రకాల నిత్యావసర వస్తువులు అందించామన్నారు. రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెర్నేటి కోటేశ్వరరెడ్డి, డివిజన్‌ నేతలు ప్రసన్నకుమార్‌, శరత్‌, 5, 4 డివిజన్‌ నేతలు మస్తాన్‌, అస్లాం, సలాం, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement