
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి,
కుమారుడికి గాయాలు
మనుబోలు: తల్లీకుమారుడు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లి మరణించగా కొడుకు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాగితాలపూరు గ్రామంలో కొండూరు వెంకటేశ్వర్లు, సుప్రజ (40) దంపతులు నివాసముంటున్నారు. వీరికి రాకేష్ అనే కుమారుడున్నాడు. సుప్రజ తన అమ్మ ఊరైన గొట్లపాళేనికి రాకేష్‌తో బైక్‌పై వెళ్లింది. తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. క్రాస్‌రోడ్డు వద్ద హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతిచెందింది. రాకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.