
హౌసింగ్ సామగ్రి అప్పగింత
ఉదయగిరి: పట్టణంలోని హౌసింగ్ గోదాము షట్టర్ తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి సిమెంట్, స్టీలు తదితర సామగ్రిని బుధవారం ఇన్‌చార్జి ఏఈ షరీఫ్‌కు అప్పగించినట్లు ఇన్‌చార్జి డీఈఈ పీరాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఈ రామకృష్ణను ఇటీవల సస్పెండ్ చేశారన్నారు. ఆయన చార్జ్ అప్పగించలేదన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. 10 బస్తాల సిమెంట్, 14 బాక్సుల ఫ్యాన్లు, 2,566 గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు, 10 ఎంఎం 597, 8 ఎంఎం 883 ఇనుప చువ్వలను ఇన్‌చార్జి ఏఈకి అప్పగించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కరిముల్లా, వీఆర్వో మాలకొండయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.