
జొన్నవాడలో అనధికార వసూళ్లు
● పట్టించుకోని అధికారులు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకు వాహనాలు వెళ్లాలంటే గ్రామ పంచాయతీకి రుసుము చెల్లించాలి. కారుకు రూ.50, ఆటోకు రూ.20, లారీకి రూ.100 ఇలా వసూలు చేస్తున్నారు. అయితే రసీదుపై పంచాయతీ సిబ్బంది సంతకం, కార్యాలయ అధికార ముద్ర ఉండదు. వాహనాల నంబర్ కూడా నమోదు చేయడం లేదు. పార్కింగ్ ఎక్కడో చూపించరు. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. రసీదుపై మీ వాహనాలకు, వస్తువులకు మేము జవాబుదారీతనం కాదు, మాకు ఎలాంటి సంబంధం ఉండదు, కాంట్రాక్టర్ అని ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు?, ఫోన్ నంబర్ వివరాలేవీ ఉండవు. భక్తుల నుంచి కేవలం నగదు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

జొన్నవాడలో అనధికార వసూళ్లు