కార్మికులతో సహపంక్తి భోజనం
నెల్లూరు(బృందావనం): చిన్నబజార్‌లోని సవరాల వీధిలో పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ పిలు పు మేరకు నగరపాలక సంస్థ కార్మికులు, వాహనాల డ్రైవర్లు, సిబ్బందితో కలిసి దీపావళి వేడుకను నిర్వహించామని చెప్పారు. అనంతరం వస్త్రాలు, బాణసంచాను అందజేసి సత్కరించారు. విభాగ్ ప్రచారక్ నవీన్, జిల్లా సంఘ్‌చాలక్ బయ్యా రవికుమార్, జిల్లా మహిళా సమన్వయ ప్రముఖ్ బయ్యా శైలజ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక, పారిశుధ్య కార్మికురాలు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.


