
అక్రమ తరలింపును అడ్డుకునేదెవరు..?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను రాత్రీ, పగలనే తేడా లేకుండా స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జొన్నవాడ వద్ద ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వేకువజామున పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దామరమడుగులోని పెన్నా నుంచి టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో నిత్యం భారీగా తరలిస్తున్నారు. మామూళ్లు అందుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ రూరల్ అధ్యక్షుడు జగదీష్ అనుచరుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగుతోందని సమాచారం. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.