
ఉద్యోగుల సమస్యలపై పోరాటం
● హంస జిల్లా అధ్యక్షుడు
చేజర్ల సుధాకర్‌రావు
● ప్రశాంతంగా కార్యవర్గ ఎన్నికలు
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో ఉద్యోగుల సమస్యలపై హెల్త్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్ కిరణ్ తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో మంగళవారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ పీఆర్సీ, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి ఇతర సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తున్నామన్నారు. తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ సూచనలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నారాయణరాజు, నిర్వహణ కార్యదర్శి జలీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు మురళి, నాగరాజు, నాగరాజమ్మ, ఉష, ఇందుకూరుపేట తాలూకా ప్రెసిడెంట్ అరుణరాణి, నెల్లూరు రూరల్ తాలుకా ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డి, సెక్రటరీ సుజాత తదితరులు పాల్గొన్నారు.
● హంస తాలూకాలో ఖాళీ పదవులకు ఎన్నికలు జరిగాయి. నెల్లూరు సిటీకి సంబంధించి ఎన్నికల అధికారులుగా జలీల్ అహ్మద్, నాగరాజు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాలూకా ప్రెసిడెంట్‌గా గౌస్‌బాషా (హెల్త్ సూపర్‌వైజర్), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వెంకటేష్ (డిప్యూటీ హెచ్‌ఈఓ), సెక్రటరీగా బి.మంజరి (హెల్త్ అసిస్టెంట్), కోశాధికారిగా ఉమామహేశ్వరి (హెడ్ నర్సు), ఉపాధ్యక్షులుగా వెంకటశేషయ్య (సీనియర్ అసిస్టెంట్), ప్రభావతి (ఫార్మసీ ఆఫీసర్), కల్పన (సచివాలయ హెల్త్ సెక్రటరీ), శ్రీదేవి (హెడ్ నర్సు), కేవీ రాహుల్ (జూనియర్ అసిస్టెంట్), జాయింట్ సెక్రటరీలుగా సురేష్‌కుమార్ (ఎస్‌ఏ), సచివాలయ హెల్త్ సెక్రటరీలుగా పనిచేస్తున్న రామలక్ష్మి, ఆసియాబేగం, జయశీల, రెహానీలను ఎన్నుకున్నారు.
● రూరల్ తాలూకా పరిధిలో పబ్లిసిటీ సెక్రటరీగా మార్క్, నిర్వహణ కార్యదర్శిగా పృథ్వీరాజ్, వైస్ ప్రెసిడెంట్‌గా బ్రహ్మేశ్వరి, జాయింట్ సెక్రటరీలుగా అనితకుమారి, లక్ష్మీనారాయణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
● కోవూరు తాలూకా యూనిట్ అధ్యక్ష, కార్యదర్శిలుగా సోలా ఉమా, రాఘవేంద్ర, కార్యవర్గ సభ్యులుగా రాజేంద్రప్రసాద్, షబీనా, హైమావతి, జరీనా, విజయలక్ష్మి, మనుషా, అలాగే ఇందుకూరుపేట తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నవనీత, కోశాధికారిగా రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా మొబీనాను ఎన్నుకున్నారు. వీరి చేత ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించారు.