
రైతుల్ని ఆదుకోవడంలో కూటమి విఫలం
● సీపీఎం నేతల ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం నేతలు విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులో ర్యాలీ జరిగింది. బాలాజీ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధాన్యం బస్తాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రోడ్డున పడుతున్నారన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
● ‘హలో రైతన్న.. చలో కలెక్టరేట్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆత్మకూరు బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.