
ఎమ్మెల్సీపై దాడి దారుణం
● మాజీ మంత్రి అనిల్‌కుమార్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌పై బుధవారం టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ ఖండించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఎన్నికల స్వేచ్ఛను హరించే ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
రాష్ట్ర ఐటీ సంయుక్త
కార్యదర్శిగా దోరశిల
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దోరశిల వెంకటరామిరెడ్డిని పార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.