
రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు నిర్వహించే యజమానులు తప్పనిసరిగా ఏపీ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధకారిణి సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకుని 5 ఏళ్లు పూర్తికాబోతున్న వారు ఒక నెల ముందే రెన్యువల్ కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్స్‌లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యశాఖకు చెందిన మెడికల్ ఆఫీసర్లు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను సేకరించి ఆ జాబితాను ఆరోగ్యశాఖ కార్యాలయంలో వారం లోపు సమర్పించాలని సూచించారు. రిజిస్ట్రేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు 7 ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేశామన్నారు.
1,98,514 మందికే
అన్నదాత సుఖీభవ
నెల్లూరు (పొగతోట): అన్నదాత సుఖీభవన పథకానికి సంబంధించి జిల్లాలో అర్హులైన రైతులు 1,98,514 మందే ఉన్నారన్నాని జిల్లా వ్యవసాయశాఖాధికారి సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆధార్‌కు, ఈకేవైసీ పూర్తయి, బ్యాంక్‌కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) లింక్ అయి 2,525 మంది ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారన్నారు. బ్యాంకు అకౌంట్‌కు మ్యాపింగ్ కాని 4,389 మంది ఉన్నారన్నారు. వీరందరూ ఆధార్ లింక్, బ్యాంక్ లింక్ చేయించుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారన్నారు. రైతులు వారి పొలాలతోపాటు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఈకేవైసీ పూర్తయిందన్న విషయాన్ని విచారించుకోవడానికి అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటామన్నారు. మన మిత్ర వాట్సాప్ 955230009 నంబర్‌లో చెక్ చేసుకోవాలన్నారు. మరణించిన వారి వారసులు ముటేషన్ చేయించుకున్న తర్వాతనే అర్హులవుతారన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులుగా ఉన్న వారు దాన్ని సరి చేసుకునేంత వరకు ఈప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై రైతులు ఆందోళన చెంద వద్దని తెలిపారు.
బస్సు అపహరణపై
కేసు నమోదు
నెల్లూరు (క్రైమ్): ఆర్టీసీ బస్సు చోరీ ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆత్మకూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని దుండగుడు అపహరించుకుని వెళ్లా డు. అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బస్సు ఆత్మకూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించి నెల్లూరుపాళెం వద్ద అధికారులు బస్సును అడ్డుకున్నారు. బస్సు నడుపుతున్న విడవలూరు మండలానికి చెందిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నెల్లూరు నవాబుపేట పోలీసులకు అప్పగించారు. ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ్‌యాదవ్ ఫిర్యాదు మేరకు చోరీ ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో నెల్లూరు నగరంలోని ఓ విద్యాసంస్థల బస్సు డ్రైవర్‌గా పని చేశాడని, కొద్దిరోజలుగా మతి స్థిమితం లేనట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.
26న విచారణకు రావాలని అనిల్‌కు నోటీసులు
● ఆయన ఇంట్లో లేకపోవడంతో
గోడకు అంటించిన పోలీసులు
నెల్లూరు (క్రైమ్): ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీమంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు కోవూరు సీఐ వి.సుధాకర్‌రెడ్డి బుధవారం రాత్రి నోటీసు జారీ చేశారు. ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు కోవూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు కోవూరు సర్కిల్ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసు ప్రతిని అందించేందుకు కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్ నెల్లూరు ఇస్కాన్ సిటీలోని అనిల్ కమార్ ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసును అతికించారు.