
కాకాణికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
నెల్లూరు (లీగల్): ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్ట్ ఏడు వరకు విధిస్తూ న్యాయమూర్తి శారదరెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషి యల్ రిమాండ్‌లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్‌పై వర్చువల్ విధానం ద్వారా నెల్లూరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో గుంటూరు సీఐడీ పోలీసులు ప్రవేశపెట్టారు. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ.. కాకాణి పక్షాన సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపించారు. కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని.. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి ఆగస్ట్ ఏడు వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఉత్తర్వులిచ్చారు.
బెయిల్ పిటిషన్ దాఖలు
మాజీ మంత్రి కాకాణిని విడుదల చేయాలని కోరుతూ బెయిల్ పిటిషన్‌ను న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి గురువారం దాఖలు చేశారు.
బెల్టుషాపులున్న
మాట వాస్తవమే
● ఎకై ్సజ్ శాఖ డీసీ శంకరయ్య
● మద్యం షాపుల్లో తనిఖీలు
ఆత్మకూరు: ప్రధాన మద్యం దుకాణాలకు సమీపంలో, గ్రామాల్లో బెల్టు దుకాణాలున్న మాట వాస్తవమేనని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య అంగీకరించారు. ప ట్టణ పరిధిలోని మద్యం దుకాణాలను ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఆరు వైన్ షాపులను పరిశీలించి వాటిలోని సరుకు, బిల్లులను సరిచూశారు. ఇతర రాష్ట్రాల మద్యం ఉందాననే అంశాన్ని పరిశీలించారు. లైసెన్స్‌లిచ్చిన ప్రాంతంలోనే దుకాణాలను ఏర్పాటు చేశారాననే అంశాన్ని ఆరాతీశారు. రెండు దుకాణాల్లో శాంపిళ్లను తనిఖీ చేశారు. అనంతరం ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బెల్టు దుకాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు పరిధిలో 32 బెల్టు దుకాణాలను గుర్తించి 32 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు దుకాణాలపై దాడులు చేసేందుకు తగినంత మంది సిబ్బంది లేరని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టడి చేస్తున్నామని వెల్లడించారు. ఏసీ దయాసాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్ రమేష్, ఆత్మకూరు సీఐ వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
వయోజన విద్య నోడల్ ఆఫీసర్‌గా మస్తాన్‌రెడ్డి
నెల్లూరు (టౌన్): వయోజన విద్య జిల్లా నోడల్ ఆఫీసర్‌గా మల్లు మస్తాన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అడల్ట్ ఎడ్యుకేషన్ జేడీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా ఆయన గురువారం కలిసి మొక్కను అందజేశారు.
న్యాయవాదుల
నిరసన నేడు
నెల్లూరు(లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో నిరసనను శుక్రవారం ఉదయం చేపట్టనున్నామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) శాఖ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అరిగెల నాగేంద్రసాయి, జిల్లా అధ్యక్షుడు అబ్బాయిరెడ్డి, జనరల్ సెక్రటరీ బ్రహ్మం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కాకాణికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్