
సోమశిలకు కృష్ణమ్మ పరుగులు
● 8928 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయానికి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం సాయంత్రానికి 545 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, గురువారం ఉదయానికి ఇది 8928 క్యూసెక్కులకు పెరిగింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరో క్రస్ట్ గేట్ నుంచి డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపామని, వాహనాలు శివాలయం మీదుగా వెళ్లొచ్చన్నారు. జలాశయంలో 27.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నార్ డెల్టాకు 1600, ఉత్తర కాలువకు 320 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని జలాశయ ఈఈ శ్రీనివాసులు తెలిపారు.