
పంచాయతీలో రూ.12 లక్షల నిధుల గోల్‌మాల్
● అవినీతిపై నేడు విచారణ
జలదంకి: మండలంలోని రామవరప్పాడు పంచాయతీలో రూ.12 లక్షల నిధులు గోల్‌మాల్‌పై గురువారం కావలి డివిజనల్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నారు. సర్పంచ్‌గా ఉన్నం సరస్వతి, పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఇద్దరు కుమ్మకై ్క గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా, పంచాయతీ తీర్మానాలు లేకుండా పలుమార్లు సర్పంచ్ భర్త ఉన్నం రవి బ్యాంకు అకౌంట్లోకి నగదును మళ్లించారు. ఉన్నం రవి స్థానికంగా టీడీపీ నాయకుడిగా ఉంటున్నాడు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయకుండా నిధులు డ్రా చేసుకున్నారనే సమాచారం గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కావలి డీఎల్‌పీఓ వెంకటరమణను వివరణ కోరగా కలెక్టక్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధుల అవినీతిపై గురువారం విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లా సైన్స్ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): జిల్లా సైన్స్ అధికారి పోస్టుకు జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని సర్‌ప్లస్‌గా ఉన్న (క్లస్టర్ ఉపాధ్యాయులు) స్కూల్ అసిస్టెంట్‌లు (సైన్స్) ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
చిన్న రథంపై
మూలస్థానేశ్వరుడి విహారం
నెల్లూరు(బృందావనం): ఆషాఢ మాస శివరాత్రిని పురస్కరించుకొని మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలను బుధవారం నిర్వహించారు. చిన్న రథంపై స్వామివారు విహరించారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.