
విద్యుదాఘాతానికి గురై..
● వ్యక్తి మృత్యువాత
విడవలూరు: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ముదివర్తి గాంధీనగర్ గ్రామానికి చెందిన సిద్ధపరెడ్డి చిన్నయ్య (37) అనే వ్యక్తి కొంతకాలంగా అన్నారెడ్డిపాళెంలో నివాసముంటూ పొలం పనులు చేస్తున్నాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన బండ్ల శంకరయ్య అనే వ్యక్తి పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లాడు. శంకరయ్య పొలం నుంచి బడ్ల రమణయ్య పొలంలోకి స్వరీస్ వైరు కిందకు లాగి ఉంది. వైరుకు చిన్నయ్య తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య బుజ్జమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.