
కాకాణిని తీవ్రవాదిలా తీసుకువస్తారా?
చిల్లకూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని గూడూరు కోర్టులో హాజరు పరిచే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఆయన్ను తీవ్రవాదిలా కోర్టుకు తీసుకు వచ్చారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. గూడూరు రెండో పట్టణంలోని వైఎస్సార్‌సీపీ రూరల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మేరిగ మాట్లాడుతూ నిరాధారమైన కేసుల్లో కాకాణిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పలు కోర్టులకు తిప్పుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే మరో కేసులో ఆయన్ను ఇరికించి పోలీసులు పీటీ వారెంట్ వేసి గూడూరు కోర్టుకు హాజరు పరిచారని తెలిపారు. అందు కోసం 144వ సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చి రెండో పట్టణంలోని కోర్టుకు మూడు వైపులా ఉన్న దుకాణాలు మూసి వేయడం, పోలీసులను మోహరించడం చూస్తుంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులు గురి చేస్తున్నారని, అందులో భాగంగానే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. తాజాగా నెల్లూరులోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై గంజాయి మూకలతో దాడికి పాల్పడ్డారని, దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అయిన తనను కూడా గూడూరు పోలీసులు కనీస అనుమతి ఇవ్వకుండా, కోర్టు ఆవరణలోకి వెళ్లకుండా ఎండలోనే గేటు బయట అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు. తనతోపాటుగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బయటకు వస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరికలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సమా వేశంలో పట్టణ, రూర ల్, చిట్టమూరు, కోట మండలాల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివా సులరెడ్డి, పల గాటి సంపత్‌కుమార్‌రెడ్డి, కోట మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్‌గౌడ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ కొండూరు సునిల్‌రెడ్డి, గూడూ రు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు గొట్టి పాటి రవీంద్రరెడ్డి, కామిరెడి కస్తూర్‌రెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, బాబురెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, యల్లా శ్రీనివాసులరెడ్డి, సాయిరెడ్డి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
కోర్టుకు హాజరు పరచడంలో
పోలీసుల అత్యుత్సాహం
శాసనమండలిలో ఫిర్యాదు చేస్తా
ఆంక్షలపై ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ధ్వజం

కాకాణిని తీవ్రవాదిలా తీసుకువస్తారా?