
వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం
ఉదయగిరి: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ పసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి పేర్కొన్నారు. ఉదయగిరి డివిజన్ పరిధిలోని వసతి గృహ సంక్షేమాధికారులతో స్థానిక ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వసతిగృహాల్లో 100 మంది చొప్పున విద్యార్థులను చేర్పించాలని సూచించారు. కొన్ని చోట్ల 35 నుంచి 75 మందే ఉన్నారని, నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 64 వసతిగృహాల్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఇవి 85 శాతం మేర పూర్తయ్యాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీ వైద్యులతో ఆరోగ్య పరీక్షలను ప్రతి నెలా నిర్వహించాలని సూచించారు. మెనూ మేరకు భోజనాన్ని అందించాలని కోరారు. ఏఎస్‌డబ్ల్యూఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.