
మరణం లేని మహానేత వైఎస్సార్
ఘనంగా 76వ
జయంతి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో మరణం లేని మహానేత అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకులు జిల్లా కేంద్రం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, కాకాణి పూజితతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, పూజిత, జంకె వెంకటరెడ్డి, మహిళా నేతలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆ మహానేత సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇల్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి పేద బడుగు బలహీనవర్గ ప్రజలకు అందించారని తెలిపారు. రాజశేఖరరెడ్డి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయన్ని దైవంగా కొలుస్తున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జిలు, జిల్లా అనుబంధ సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరణం లేని మహానేత వైఎస్సార్

మరణం లేని మహానేత వైఎస్సార్