
తప్పుడు హామీలు.. బాబు మోసాలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, చంద్రబాబు మోసాలపై ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్దామని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్‌లో మంగళవారం ఎంపీ మిఽథున్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తీరు మారలేదన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెబుతూ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు పెంచడం, కూటమి నేతలు సిండికేట్లుగా మారి ప్రజాధనాన్ని దోచుకుతినడం చూస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మోసపూరిత విధానాలను ఎండగడుతామన్నారు. 40 శాతం ఓటింగ్‌తో అత్యధిక జనాదరణ కలిగిన పార్టీగా వైఎస్సార్‌సీపీకి గుర్తింపు ఉందన్నారు. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ క్యాడర్ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక కూటమి నేతలు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలు అడ్డుకుంటున్నారన్నారు. ఇది ఎంతో కాలం చెల్లదని, కూటమి ప్రభుత్వానికి అర్థమయిందని, అందుకే జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన అంటేనే భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీమంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి పూజిత తదితరులు హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్,
ఎంపీ మిథున్‌రెడ్డి