
పచ్చ గూండాల అరాచకం
జిల్లాలో పచ్చ కిరాయి గూండాల అరాచకం సంచలనం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సుజాతమ్మకాలనీలో ఉన్న మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. రాజకీయ చైతన్యానికి, హుందా రాజకీయాలకు మారు పేరైన నెల్లూరులో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను జీర్ణించుకోలేని పచ్చమూకలు ఇంట్లో ప్రసన్న తల్లి శ్రీలక్ష్మమ్మ ఒకటే ఉన్న రాత్రి సమయంలో మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంట్లోని ప్రతి గదిలో బీభత్సం చేశారు.