
అనుమానాస్పద స్థితిలో..
● యువకుడి మృతి
అల్లూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన ఇరగాలదిన్నె నాని (21) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో తల్లి శరణ్య ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అల్లిమడుగు సంఘానికి చెందిన కొందరు తీసుకెళ్లినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నాని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం అల్లూరు చెరువులో మృతదేహం లభ్యమైంది. దానిని శవపరీక్ష నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ సీఐ పాపారావు తెలిపారు.