
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.25 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8
వెట్టిచాకిరి నుంచి కాపాడండి
నెల్లూరు రూరల్: యానాది వర్గానికి చెందిన నిరుపేద పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి హోటళ్లు, వివిధ గృహాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వారిని కాపాడాలని యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చౌటూరు శీనయ్య కోరారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారన్నారు. సదరు కిడ్నాపర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారన్నారు. బాధితులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా తరిమేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. సమావేశంలో శీనమ్మ, ఎం.మస్తానమ్మ, శేషమ్మ, మౌనిక, సుబ్బరత్న, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

నిమ్మ ధరలు (కిలో)