
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సైదాపురం: బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాపురం దళితవాడలో సోమవారం జరిగింది. ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. దళితవాడకు చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఓ కుమారుడు గతంలో మృతిచెందాడు. దంపతులు మూడేళ్ల క్రితం అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులు తీర్చేందుకు వెంకటరమణయ్య కువైట్ వెళ్లాడు. మూడేళ్లపాటు అక్కడే ఉండి గత వారం స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూ డూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.